Verse
జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు
యేసు కొరకే జీవింతును‖ 2x ‖
నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే
నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే
జీవింతును జీవింతును
జీవింతును జీవింతును‖ 2x జీవింతు ‖
Verse
నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే
బహుమానము పొందగ పరుగిడుదున్
వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి
కొరకే నే వేగిరపడుదును‖ 2x ‖
నన్ను ప్రేమించిన యేసుని చూతును
నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును
గురి వైపుకే – పరుగెడుదును
వెనుదిరుగను – వెనుదిరుగను‖ 2x జీవింతు ‖
Verse
శ్రమయైనా బాధైననూ – హింసయైనా
కరువైనా ఎదురైననూ
ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా
ఎతైనా లోతైననూ‖ 2x ‖
నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి
నేను విడిపోదునా ప్రభు నీడనుండి
జీవింతును – నా యేసుతో
జయమిచ్చును – నా యేసుడే‖ 2x జీవింతు ‖