Verse
Reference: నీవు సిద్ధపరచినవి యెవనివగునని అతనితో చెప్పెను లూకా Luke 12:20
Chorus
పల్లవి: జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?
ఈ లోకములో జీవించు జీవితమంత
జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?
Verse
శరీరేచ్ఛలకై ఆశలుండు - ఈ ధరణియందు
సుఖభోగులుగా జీవింతురు - ఈ ధరణియందు
వారి యూహలు దినమెల్ల చెడియున్నవి
వారి పాప జీవిత మంత శాపమెగ
Verse
ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు
ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు
వారి కలవరమంత ధనము ధనమే
వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే
Verse
స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు
గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు
వారి మనసులు సంకుచితములై యుండు
వారి జీవిత ప్రయాసము - పతనమేగా
Verse
విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు
కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు
వారు ప్రభుకై దాగియే నిలచెదరు
దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు