Verse
జీవిత తృష్ణలను - నాదు
తీర్చుమయ్యా ప్రియ - యేసునాథా
Verse
నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించు
ప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము
Verse
నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగా
నిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము
Verse
సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగా
అత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము
Verse
పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివి
నిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము