Chorus
జీవిత యాత్రలో నాదు గురి నీవెగా నీకు సాటియెవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా
Verse
నన్ను నడిపించు చుక్కాని నీవేకదా నీవేకదా‖ 2x ‖
నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా నీవేకదా‖ 2x ‖
నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా నన్ను నడిపించుమో యేసువా
Verse
నాకు నిరతంబు మధిలోన నీద్యానమే నీద్యానమే‖ 2x ‖
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే నీ గానమే‖ 2x ‖
నాకు నీవేగా సర్వస్వము నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడనీవెగా నిన్ను స్తుతియింతుమో యేసువా