Verse
జీవితాంతము నే నీతో నడవాలని
ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనసంతా నీవే నిండాలని
తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక
పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని
యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా‖ 2x ‖
దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా‖ 2x ‖
Verse
నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను
నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను‖ 2x ‖
నరుని నమ్ముటే నాకు మోసమాయెను
భయముతోటి నా కన్ను నిద్ర మరచెను‖ 2x ‖
మనసులోన మానిపోని గాయమాయెను‖ 2x ‖
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం‖ 2x పడితినయ్యా ‖
Verse
లోక పొగడ్తలకు నే పొంగిపోతిని
దాని కనుసైగలోన నేను నడచుకొంటిని‖ 2x ‖
చెడ్డదైన బ్రతుకు సరి జేయ జూసితి
ప్రయాసము వ్యర్ధమై నే నిరసిల్లితి‖ 2x ‖
ముగిసిపోయెననుకుంటి నా ప్రయాణము‖ 2x ‖
నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం‖ 2x పడితినయ్యా ‖