Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithaanthamu varaku neekae seva salpu

జీవితాంతము వరకు నీకే సేవ సల్పు

Jeevithaanthamu varaku neekae seva salpu

Lyricist: C D Shubhamani
Chorus
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి
ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా‖ జీవితాం ‖
Verse
ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును
నీవు నాకడ నున్న నిజమిది రక్షకా‖ జీవితాం ‖
Verse
అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ
మార్గమందున పూనినడచెద రక్షకా‖ జీవితాం ‖
Verse
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను
గెల్వను చాలు నీ కృప రక్షకా‖ జీవితాం ‖
Verse
నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము
రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా‖ జీవితాం ‖
Verse
మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక
నిన్ను వీడనంటిని రక్షకా‖ జీవితాం ‖
Verse
పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే
వెంబడింపగ కృప నొసంగుము రక్షకా‖ జీవితాం ‖

Related Tags

CommitmentDedicationService