Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithaanthamu Varaku Neeke

జీవితాంతము వరకు నీకే

Jeevithaanthamu Varaku Neeke

Lyricist: P D Shubhaamani
Verse
జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా‖ జీవితాంతము ‖
Verse
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా‖ జీవితాంతము ‖
Verse
అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా‖ జీవితాంతము ‖
Verse
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా‖ జీవితాంతము ‖
Verse
నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా‖ జీవితాంతము ‖
Verse
మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా‖ జీవితాంతము ‖
Verse
పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా‖ జీవితాంతము ‖

Related Tags

CommitmentDevotionalPrayer