Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithamantha Nee Premagaanam Pranutim

జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతిం

Jeevithamantha Nee Premagaanam Pranutim

Chorus
జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో‖ జీవిత ‖
Verse
సర్వసమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు
నీ నామధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా
రక్షకా‖ జీవిత ‖
Verse
సృష్టినంతటిని నీ మాటచేత సృజియించితివిగా
మా దేవ దేవా నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా
స్తుతియింతు నా రక్షకా‖ జీవిత ‖
Verse
కలుషాత్ములైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు
నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన ప్రేమన్ స్తుతియింతు
నా రక్షకా‖ జీవిత ‖
Verse
పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీరాజ్యంబులో
ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు నా రక్షకా

Related Tags

PraiseWorshipJesus