Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithamanthaa Nee Prema

జీవితమంతా నీ ప్రేమ

Jeevithamanthaa Nee Prema

Lyricist: Andhra Kraisthava Keerthanalu
Verse
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో‖ 2x ‖
Verse
సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం‖ 2x ‖
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా –‖ 2x జీవితమంతా ‖
Verse
సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా‖ 2x ‖
నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా –‖ 2x జీవితమంతా ‖
Verse
కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా‖ 2x ‖
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా –‖ 2x జీవితమంతా ‖

Related Tags

PraiseWorship