Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithambu Ghora Kashtanashtambul Aava

జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవ

Jeevithambu Ghora Kashtanashtambul Aava

Verse
జీవితంబు ఘోర కష్టనష్టంబుల్
ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
దేవుడిచ్చినట్టి ఈవులెంచుము
నీ వాశ్చర్య మొందెదవు. వానికై.
Chorus
ఎంచుము లెక్కించు మీవులన్‖ ఎంచుము లెక్కించు మీవులన్ ‖
ఎంచుచూడు మేసుదీవెనల్
ఎంచు మెంచు మెంచు మీవులన్
వింత నొందెదవు నీవు వానికై‖ వింత నొందెదవు నీవు వానికై ‖
Verse
చింతమానసంబు నీకు గల్గినన్
వంతచే భారంబు గల్గ నీయెదన్
సంతసంబుతోడ నెంచుమీవులన్
వింత నొందెదవు నీవు వానికై
Verse
నాశనంబు జెందు నాస్తి జూడగా
వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన
భాసురంపు భాగ్యముం దలంపుమా
యీ సౌభాగ్యమే గదా సదా
యుండు
Verse
జీవితాదియందు ధైర్య మొందుము
దేవుడుండు నెల్లవార్కి తోడుగ
జీవయాత్ర యందు సాయమియ్యగన్
దేవదూతల్ నీకు తోడుగా నుండు.

Related Tags

FaithComfortBlessing