Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jeevithamlo Nerchukunnaanu Oka

జీవితంలో నేర్చుకున్నాను ఒక

Jeevithamlo Nerchukunnaanu Oka

Verse
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం‖ 2x ‖
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా‖ జీవితంలో ‖
Verse
ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకున్నాను శక్తన్తయు
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము‖ 2x జీవితంలో ‖
Verse
నిర్మించుకున్నాను నా జీవితం
సతతం యేసులో జీవించాలని
పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము‖ 2x జీవితంలో ‖

Related Tags

PraiseTestimonyDedication