Verse 1
జీవితాంతమునే నీతో నడవాలని
ఎన్నడు నీ చేయి నేను విడువరాదని
నీ సన్నిధిలో నిత్యమునే నుండలాని
నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని
నా మనసాంత నీవై నిండాలని
తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కొరికా
పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని
యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా‖ 2x ‖
దారి తప్పియున్న నన్ను వెదకి రక్షియించినావయ్యా‖ 2x ‖
Verse
నేకన్న పగటికలలన్ని కల్లలాయెను
నీవు లేని నా స్వానీతి వ్యర్ధమాయెను‖ 2x ‖
నన్ను నమ్ముటె నాకు మొసమాయెను
భయముతోటి నా కన్ను నిద్రమరిచెను‖ 2x ‖
మనసులోన మానిపోని గాయమాయెను‖ 2x ‖
నీ ప్రేమ ఇచ్చెనాకు ఓ క్రొత్త జీవితం‖ 2x ‖
Verse
లోకంతో గడపాలని పొంగి పోతిని
దాని కనుసైగలోన నేను నడుచుకుంటిని‖ 2x ‖
చెడ్డదైన బ్రతుకు సరి చేయ జూసితి
ప్రయాసము వ్యర్ధమై నే నీరసిల్లితి‖ 2x ‖
ముగుసి పోయెననుకొంటి నా ప్రయాణము‖ 2x ‖
నీ ప్రేమ ఇచ్చెనాకు ఓ క్రొత్త జీవితం‖ 2x ‖