Verse
జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ
దాల్చిన తరి‖ జ్ఞాను ‖
Verse
చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల
చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి
బోళము సాంబ్రాణి వేసి‖ జ్ఞాను ‖
Verse
దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి
మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు‖ జ్ఞాను ‖
Verse
ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ
బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య
య్యూదజనుల మధ్య‖ జ్ఞాను ‖
Verse
ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి
మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ
జేర్చి‖ జ్ఞాను ‖