Chorus
జో జో లాలి‖ 2x ‖
బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి
నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో..
Verse
జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి
పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి
తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని
వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె
Verse
నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు నీకు లేదాయే
తారపు వెలుగులు యిచ్చిన నీకే చిరుదీపమేనాడు కరువాయె
ఎవరి కొరకు నీవస్తావో వారెవరికి కానరా రాయె
అన్ని ఉన్న దేవుడవు లేనివానిగా జన్మించితివి