Verse
జోలా ప్రభు యేసయ్య ఒడిలోన జోల
జోలా దేవ దేవుని నీడలో జోల
పరలోక తండ్రిని పరిశుద్ధుడని పలుకు
దూత గణములు పాడు వేళ
Verse
నిదురలో యేసయ్యతో ఆటాడు కుంటావు
ఆటలో ఎల్లప్పుడూ నువు నవ్వుతుంటావు
నీ నవ్వులు మాకు కనపడినా
దానికి తోరణము మాకు తెలిసేనా
ఇదే ఇదే దైవ లీల
ఊయలలో ఊహల్లో విహరిస్తూ వుంటావు
విహరిలో వేసారితే ఏడుస్తు వుంటావు
నీ ఏడుపు మాకు వినపడినా
దానికి కారణము మాకు కనపడునా
ఇదే ఇదే దైవ లీల
నీ యేసు తోడులో నిండుగ జీవించు
నీ జీవన గమనంలో శ్రీయేసుని సేవించు
దీవెనలు మాకు కనపడినా
దానికి నడిపింపు మాకు వెలువడునా
ఇదే ఇదే దైవ లీల