Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Junte Thene Dhaarala Kannaa

జుంటె తేనె ధారల కన్నా

Junte Thene Dhaarala Kannaa

Lyricist: Hosanna Ministries
Verse
జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను‖ 2x ‖
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా‖ 2x జుంటె తేనె ‖
Verse
యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి‖ 2x ‖
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే‖ 2x జుంటె తేనె ‖
Verse
యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి‖ 2x ‖
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే‖ 2x జుంటె తేనె ‖
Verse
యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి‖ 2x ‖
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే‖ 2x జుంటె తేనె ‖

Related Tags

PraiseWorship