Chorus
జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో
దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి
ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా‖ జ్యోతిగ ‖
Verse
మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును
శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు
జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా‖ జ్యోతిగ ‖
Verse
సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి
జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార
దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో‖ జ్యోతిగ ‖
Verse
నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు
కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప
మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ‖ జ్యోతిగ ‖
Verse
సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే
యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర
త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను‖ జ్యోతిగ ‖