Chorus
జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే‖ 2x ‖
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయమూ నీవే - నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే‖ 2x ‖
Verse
నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా‖ 2x ‖
నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా‖ 2x ‖
Verse
నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ‖ 2x ‖
నీకిష్టమైన పాత్రను చేయ - నను విసిరేయక సారెపై ఉంచావా‖ 2x ‖
Verse
నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా‖ 2x ‖
త్రియేక దేవా ఆదిసంభూతుడా - నిను నేనేమని ఆరాధించెద‖ 2x ‖