Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Jyothirmayuni Jananam Sarvalokaaniki

జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి

Jyothirmayuni Jananam Sarvalokaaniki

Lyricist: Paramjyothi Gummalla
Verse
జ్యోతిర్మయుని జననం – సర్వలోకానికి
సంబరమే సంబరమే జగమంతా సంబరమే
ఆరాధింప రండి – ఆనందింప రండి
Chorus
రాజా నీకే స్తోత్రము
శ్రీ యేసు రాజా నీకే స్తుతి స్తోత్రము
Verse
పాప చీకటి తొలగింప – వెలుగుగా వచ్చెను
వ్యాధి బాధలు తొలగింప – వైద్యునిగా వచ్చెను
అద్భుతకరుడు – ఆదిదేవుడు
ఆశ్చర్యకరుడు – అద్వితీయుడు
పస్కా బలిపశుతానై – గొర్రెపిల్లగ వచ్చెను
చెదరిన మందను సమకూర్చ కాపరిగా వచ్చెను
మంచికాపరి – గొప్పకాపరి
ఆత్మలకాపరి – ప్రధానకాపరి
ధనవంతులుగా చేయుటకు – దీనుడుగా వచ్చెను
చచ్చిన మనలను బ్రతికింప జీవముగా వచ్చెను
శ్రీమంతుడు – శ్రీయేసుడు
రాజాధిరాజు – షాలేము రాజు

Related Tags

WorshipJesusChristmas