Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaalam Samayam Naadenantu

కాలం సమయం నాదేనంటూ

Kaalam Samayam Naadenantu

Verse
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా‖ 2x ‖
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది‖ 2x ‖
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా‖ 2x కాలం ‖
Verse
ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా‖ 2x ‖
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు‖ 2x ఆగవేమయ్యా ‖
Verse
చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు‖ 2x ‖
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు‖ 2x ఆగవేమయ్యా ‖
Verse
సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు‖ 2x ‖
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు‖ 2x ఆగవేమయ్యా ‖

Related Tags

RepentanceJudgmentWarning