Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaalamella Maarinaa Maaradu Naa Yesu Naadhudu

కాలమెల్ల మారినా మారడు నా యేసు నాధుడు

Kaalamella Maarinaa Maaradu Naa Yesu Naadhudu

Verse
పల్లవి : కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు
భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు
పరలోక మహిమను - దివిదూత గణమును
విడనాడి నన్ను వేడుక వచ్చెను
ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను
పాపి కొరకు ప్రాణమిచ్చెను‖ కా ‖
Verse
మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను
కరుణ తోడను - నా కడకు చేరెను
నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు
నాదు బ్రతుకు మార్చి వేసెను‖ కా ‖
Verse
మంచి కాపరి - నా చెంత చేరెను
లేమిని లేకుండా చేసెను
దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను
పాతవి గతించెను - గీతమాలపింతును
యేసు తోడ నుందు నిరతము‖ కా ‖
Verse
దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను
కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను
నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా
కొదువలేదు - దిగులు లేదుగా‖ కా ‖

Related Tags

PraiseJesusFaithfulness