Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaalaviluva Neeku Theliyakapoyina Kanneeru Kaarchedhavu

కాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు

Kaalaviluva Neeku Theliyakapoyina Kanneeru Kaarchedhavu

Verse
కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు
Verse
భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము
భావమందు తలచి యేసుచే జీవించుము
Verse
ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె
రక్షణ్య జీవితమొంది సంతోషించ
ననుగ్రహ కాలమిదే యని తెలిసి
Verse
ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము
ఘనమైన పనిని మరచి నిద్రించిన
పగలు గతించక నిక నేమి చేతువు
Verse
నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును
నశింప జేసెను కృపతో నీ కిడిన
ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన
Verse
ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను
ఏ సమయము నీకు సొంత మనకుము
ఈ ఏటనే నీవు మరణించవచ్చును

Related Tags

RepentanceSalvationTime