Chorus
కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి
పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ‖ కానా ‖
Verse
రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు
హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత
భావమాలిన్యంబుఁ బాపి యిపుడు‖ కానా ‖
Verse
దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు
తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము
లేకుండ గ బ్రతుక నిమ్ము‖ కానా ‖
Verse
ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన
నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా
నెరవేర్పు గూడ నుండు‖ కానా ‖
Verse
చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు
డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు
కరుణానిధీ‖ కానా ‖
Verse
పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు
జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప
శక్తి నిమ్ము‖ కానా ‖