Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaanaraave Alanaati Kanneeti

కానరావే అలనాటి కన్నీటి

Kaanaraave Alanaati Kanneeti

Verse
కానరావే అలనాటి కన్నీటి ప్రార్ధనలు
కదలవేమి అపవాది చెరసాల పునాదులు
ఇది నీ లోపమా – మరి నా లోపమా
యోచించుమా క్రీస్తు సంఘమా‖ 2x ‖
యోచించుమా క్రీస్తు సంఘమా‖ కానరావే ‖
Verse
సమూయేలుల నందించే హన్నాలేరి
సమర్పణతో ప్రార్ధించే ఎస్తేరులేరి‖ 2x ‖
నీతి కొరకు నిలబడే స్తెపనుల జాడేది‖ 2x ‖
నిండు మనస్సుతో ఆరాధించే కాలేబులెటు పోయిరో
కాలేబులెటు పోయిరో‖ ఇది నీ లోపమా ‖
Verse
అపొస్తలుల ఆదరించే బర్నబాలేరి
ఆత్మలకై పరుగెత్తే ఫిలిప్పులేరి‖ 2x ‖
శ్రమలకే ఎదురు నిలచే పౌలు వారసులేరి‖ 2x ‖
శత్రువుతో పోరాడి గెలిచే దావీదులెటు పోయిరో
దావీదులెటు పోయిరో‖ ఇది నీ లోపమా ‖
Verse
నిద్ర లేవాలి ఓ సంఘమా
అసత్యాన్ని ఖండించే సత్య స్థంభమా
క్రీస్తుకై కదలాలి ఓ సంఘమా
ఉజ్జీవం నీలో నిండాలి
ఓ సంఘమా… నిజ సంఘమా

Related Tags

PrayerRepentanceChurch