Verse
కాపాడే దేవుడు యేసయ్యా
కరుణించే రక్షకుడేసయ్యా
మనసు మార్చు దేవుడు యేసయ్యా
నిత్య జీవ మార్గం యేసయ్యా‖ 2x ‖
ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా
ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా‖ కాపాడే ‖
Verse
మనుష్యులను నమ్మొద్దనెను
మంచి మాటలు పలికెదరనెను‖ 2x ‖
మోసం చేసే మనుష్యులకంటే
మంచి దేవుడు యేసే మిన్నన్నా
మోక్షమిచ్చుఁ యేసే గొప్పని
తెలుసుకుంటే మంచిది ఓరన్నా‖ ఓరన్నో ‖
Verse
నిన్ను విడువనన్నాడు
ఎడబాయను అన్నాడు‖ 2x ‖
దిగులు చెంది కలత చెందకు
నీ అభయం నేనే అన్నాడు‖ 2x ఓరన్నో ‖