Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaaparivai Nannu Kaachave

కాపరివై నన్ను కాచవే

Kaaparivai Nannu Kaachave

Lyricist: Ameeth Evans
Verse
కాపరివై నన్ను కాచవే
నా యేసయ్యా నీవే నా ఆశ్రయం
Verse
నాయకుడై నన్ను నడిపావే
నా యేసయ్యా నీవే నా మార్గము
Verse
గాఢాంధకార లోయలో
నె సంచరించు వెలలో
మార్గము నీవై నన్ను నడిపించితివే
Verse
ప్రళయం లోనున్న వేళలో
మునిగిపోతున్న వేళలో
నీ ప్రేమ నాపై చూపి రక్షించితివే
Verse
జీవితమే నీకంకితం నా మెస్సయ్యా
Verse
నీకే నీకే నా ఆరాధన
నీకే నీకే నా స్తుతి ప్రార్థన
Verse
నీవే నీవే నా స్తోత్రహుడా
నీవే నీవే నా స్తుతి పాత్రుడా
Verse
మార్గమే తెలియక మౌనినై ఉండగా
గమ్యముకే నన్ను చేర్చితివే
Verse
ఒడిపోయుండి తప్పిపోతుండగా
జీవముతో నన్ను నింపితివే
Verse
నీ వాక్యం శ్వాసగా నాలో నింపి
నీ సత్యం జ్యోతిగా నన్ను నడిపి
నా శూన్యం ఆశగా నువ్వు మలచి
నా స్వరమే రాగముగా మార్చి
Verse
యోగ్యతే లేని నన్ను వెంటాడి వచ్చితివే
నా లోక పయనం లోనే స్థంభముగా నిలిచితివే
Verse
కనీరె తుడచి
ఆనందమే నింపి
Verse
కాపరివై నన్ను కాచవే
నా యేసయ్యా నీవే నా ఆశ్రయం
Verse
నాయకుడై నన్ను నడిపావే
నా యేసయ్యా నీకే నా వందనం

Related Tags

WorshipProtectionGuidanceShepherd