Verse
కావలివాడా ఓ కావలివాడా
కనులు తెరచి పొలమును చూడు
కోతకు వఛ్చిన పంటను కోయుము‖ కావలి ‖
పిలిచెను నీ యజమానుడు
జత పనివాడవై యుండుటకు‖ 2x ‖
కొలుచును నీ ఫలమంతమున
పని చేసిన రీతిగనే‖ 2x కావలి ‖
నమ్మెను నీ యజమానుడు
అప్పగించెను తన స్వాస్థ్యము‖ 2x ‖
తిరిగి వచ్చును జీతమియ్యను
సిద్ధ పడుము ఇక నిద్ర మాని‖ 2x కావలి ‖
ఎంచెను నీ యజమానుడు
నీ పాదములు సుందరములని‖ 2x ‖
ఉంచెను కర్మెలు పర్వతముపై
పరుగిడుము పరాక్రమ శాలివై‖ 2x కావలి ‖
వేయుము పునాది నేర్పరివై
చెక్కుము రాళ్లను శిల్ప కారివై‖ 2x ‖
కొయ్య కాలును కర్ర గడ్డియు
కాలిపోవును అగ్ని పరీక్షలో‖ 2x కావలి ‖