Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kadalakunduvu Seeyonu Kondavale

కదలకుందువు సీయోను కొండవలె

Kadalakunduvu Seeyonu Kondavale

Verse
కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె‖ 2x ‖
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా‖ 2x ‖
Verse
కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా‖ కదలకుందువు ‖
Verse
నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు‖ కదలకుందువు ‖
Verse
నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్‖ కదలకుందువు ‖

Related Tags

FaithProtectionStrength