Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kadavari Dinamulalo Raavali Ujjivam

కడవరి దినములలో రావాలి ఉజ్జీవం

Kadavari Dinamulalo Raavali Ujjivam

Verse
కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరం
Verse
భావి భారత పౌరులారా కదలిరండి
ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా
తరలి రండి ఉద్వేగముతో
Verse
క్రీస్తు సిలువను భుజమున మోస్తు
ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము
ఇలలో మారు మ్రోగునట్లు
విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
Verse
కులము మతము మనిషికి రక్షణ
ఇవ్వవనినినదించండి యేసు క్రీస్తు
ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
మూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకు
అనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూ
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం

Related Tags

EvangelismYouthRevival