Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalalaa Unnadi

కలలా ఉన్నది

Kalalaa Unnadi

Lyricist: Samuel Karmoji
Verse
కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిశిలోన – ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను‖ 2x కలలా ‖
Verse
మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా‖ 2x ‖
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ‖ కలలా ‖
Verse
శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి‖ 2x ‖
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ‖ కలలా ‖

Related Tags

PraiseTestimonyHope