Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalalaanti Brathuku Naadi

కలలాంటి బ్రతుకు నాది

Kalalaanti Brathuku Naadi

Lyricist: P Satish Kumar
Verse
కలలాంటి బ్రతుకు నాది
కన్నీటి ఊట నాది‖ 2x ‖
కలలోనైనా ఊహించలేదే
కమనీయమైన ఈ బంధం
కల్వరిలో సిలువ త్యాగ బంధం‖ 2x కలలాంటి ‖
Verse
నేనేమిటో నా గతమేమిటో
తెలిసిన వారే క్షమియించలేరే
నా నడకేమిటో పడకేమిటో
ఎరిగిన వారే మన్నించలేరే
హేయుడనై చెడియుండగా.. నా యేసయ్యా
ధన్యునిగా నను మార్చినావే‖ 2x కలలాంటి ‖
Verse
నేనేమిటో నా విలువేమిటో
తెలియకనే తిరుగాడినానే
నీవేమిటో నీ ప్రేమేమిటో
ఎరుగక నిను నే ఎదిరించినానే
హీనుడనై పడియుండగా.. నా యేసయ్యా
దీవెనగా నను మార్చినావే‖ 2x కలలాంటి ‖

Related Tags

GraceComfortSalvation