Verse
కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా‖ 2x ‖
ఆరాధింతును‖ 4x ‖
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను‖ 2x ‖
Verse
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది‖ 2x ‖
Verse
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది‖ 2x ఆరాధింతును ‖
Verse
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి‖ 2x ‖
Verse
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది‖ 2x ఆరాధింతును ‖