Verse
కలములతో వ్రాయగలమా.. కవితలతో వర్ణించగలమా.. ?
కళలతో వివరించగలమా.. నీ మహోన్నతమైన ప్రేమా...‖ 2x ‖
Chorus
ఆరాధింతును - ఆరాధింతును‖ 2x ‖
రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను‖ 2x ‖
Verse
ఆకాశములు - నీ మహిమను - వివరించుచున్నవి
అంతరిక్షము - నీ చేతిపనిని - వర్ణించుచున్నది‖ 2x ‖
దేవా.. నా ప్రాణము - నీకొరకై తపియించుచున్నది‖ 2x ‖
ఆరాధింతును - ఆరాధింతును‖ 2x ‖
రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను‖ 2x ‖
Verse
సెరాపులు - కెరూబులు - నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహాదూతలు - ప్రధానదూతలు - నీ నామము కీర్తించుచున్నవి‖ 2x ‖
దేవా.. నా ప్రాణము - నీకొరకై తపియించుచున్నది‖ 2x ‖
ఆరాధింతును - ఆరాధింతును‖ 2x ‖
రారాజువు నీవే - నా తండ్రివి నీవే - నిను విడువను ఎడబాయను‖ 2x ‖