Chorus
కలతలేని నీదు ప్రేమ కరుణమయుడా ఓ ప్రభో
కరములెత్తి స్మరించెద నా జీవితంలో నిన్ను ప్రభో
నా జీవితంలో నిన్ను ప్రభో‖ 2x ‖
Verse
నేనెన్నడైనా నోరు తెరచి నిన్ను పిలువక పోతిని‖ 2x ‖
నీ మాట వినకపోతిని
తలుపు చెంతను నిలువగా నీ శిరము వానకు తడవగా
నా పడక దిగిరాపోతిని - నా తలుపు తీయకా యుంటిని‖ కలతలేని ‖
Verse
గోతిలో పడిపోతిని ఎవరాదరించక పోయిరి‖ 2x ‖
నజరేయుడేసే నన్ను చూచి గోతి నుండి లేపెను
పరలోకముందని చెప్పెను‖ 2x ‖
Verse
కొండ సందున గుండె బాధతో అంగలార్చుచుంటిని‖ 2x ‖
ఏడ్చి ఏడ్చి నిన్ను అడిగితే హస్తముతో నన్ను తాకెను
తన రక్తముతో నన్ను కడిగెను‖ 2x ‖
Verse
కరువులు కష్టములు శ్రమలు బాధలెన్ని కలిగిన‖ 2x ‖
నిన్ను విడువను కన్నతండ్రి సిలువ నెత్తుకు సాగేదా
ఆ సిలువ నెత్తుకు సాగేద‖ 2x ‖