Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalavantidi Nee Jeevithamu

కలవంటిది నీ జీవితము

Kalavantidi Nee Jeevithamu

Lyricist: John Wesley
Verse
కలవంటిది నీ జీవితము
కడు స్వల్ప కాలము
యువకా అది ఎంతో స్వల్పము‖ 2x ‖
విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువతీ వ్యర్ధము చేయకుము‖ కలవంటిది ‖
Verse
నిన్ను ఆకర్షించే ఈ లోకము
కాటు వేసే విష సర్పము
యువకా అది కాలు జారే స్థలము‖ 2x ‖
ఉన్నావు పాపపు పడగ నీడలో
నీ అంతము ఘోర నరకము
యువకా అదియే నిత్య మరణము‖ 2x కలవంటిది ‖
Verse
నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
నూతన సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును‖ 2x ‖
ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు‖ 2x కలవంటిది ‖