Verse 1
కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?‖ 2x ‖
నీవు నాకుండగా - నీవే నా అండగా
నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
Verse
సర్వకృపానిధివి - సంపదల ఘనివి‖ 2x ‖
సకలము‖ 3x ‖
సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
Verse
నిత్యమూ కదలని - సీయోను కొండపై‖ 2x ‖
యేసయ్యా‖ 3x ‖
యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?‖ 2x ‖
కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?