Chorus
కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ
లొందినీ ప్రాణము బెట్టితి‖ కల ‖
Verse
తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను
గుందితి‖ కల ‖
Verse
పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు‖ కల ‖
Verse
దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద‖ కల ‖
Verse
జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి‖ కల ‖
Verse
శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు?‖ కల ‖