Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaligiyunna Samasthamu Needenayya

కలిగియున్న సమస్తము నీదేనయ్యా

Kaligiyunna Samasthamu Needenayya

Lyricist: Bro Sudheer Nelaturi
Verse
కలిగియున్న సమస్తము నీదేనయ్యా
పొందుకున్నది నీ దగ్గరేనయ్యా
నీదే ఆ త్యాగము నీదే మా జీవము
Verse
మా బలము నీ బలహీనతను వివరింపగలదా
మా ధనము నీ దీనత్వమును వర్ణింపదగునా
మాకున్న సమస్తము నీ లేమిలోనిదే
మా శక్తి బలములు బలహీనుడ నీవే
మా ధనము ఈ బలము
నిను కొలచుటకై చాలదయ్యా
మా అధికారం నీ దాసత్వమును వెక్కిరింపగలదా
ఈ అలంకార అందములు నీ గాయపడిన శరీరము సాటిదా
మాకున్న సమస్తము నీ లేమిలోనిదే
ఈ అధికారంధములు నీ పాత్రలోనిదే
మా జ్ఞానము ఈ ప్రాయము
నిను స్తుతించుటకై చాలదయ్యా

Related Tags

WorshipDevotionalSurrender