Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaliseti Andhaala Anubhandhame

కలిసేటి అందాల అనుబంధమే

Kaliseti Andhaala Anubhandhame

Lyricist: Joshua Shaik
Verse
కలిసేటి అందాల అనుబంధమే
ఇది ఏనాటికైనా మహనీయమే
ఎన్నెన్నో కాలాల అనురాగమే
ఈనాడే ఇలలో శ్రీకారమే
కమనీయమైన కళ్యాణమే
Verse
ఇరువురు ఏకమై జీవించాలి
దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి
కలిమిలో లేమిలో ప్రేమించాలి
మమతలే మల్లెలై పరిమళించాలి
Chorus
మురిసిపోయే వేదిక
మరువలేని వేడుక
ఒకరికొకరు తోడుగా
ప్రభువు చేసే జంటగా
Chorus
ప్రేమానురాగాల ఈ బంధమే
మంగళమేగా శుభప్రదమే
ఆనందమేగా – కళ్యాణమే
Verse
గుణములే సిరులుగా స్వీకరించాలి
చెరగని స్నేహమై నిలిచిపోవాలి
క్రీస్తులో పయనమే సాగించాలి
వాక్యమే మనసులో పదిలమవ్వాలి
Chorus
ప్రభువు ద్రాక్షావల్లిగా
ఫలమునిచ్చే తీగలా
వరములెన్నో పొందగా
తరములెన్నో చూడగా
Chorus
పరిశుద్ధ దేవుని నిర్ణయమే
వైభోగమేగా శుభకరమే
కమనీయమైన కళ్యాణమే

Related Tags

BlessingMarriageWedding