Verse 1
కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ‖ 2x ‖
Verse
హోరు గాలులు వీచగా తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా‖ 2x ‖
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక
Verse
కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా‖ 2x ‖
యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా సంతసించుము నీవిక