Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kallundi Choodaleni

కళ్లుండి చూడలేని

Kallundi Choodaleni

Lyricist: M Mark, Sven Edwards
Verse
కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు‖ 2x ‖
వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే
జీవింప చేయాలి నీ మహిమలోనే‖ కళ్లుండి ‖
Verse
కంటి చూపుతో నన్ను కాచియున్నావు
గుండె పైన వాత పెట్టి నను మార్చినావు‖ 2x ‖
మరణాన్ని తప్పించావు
జీవాన్ని నాకిచ్చావు‖ 2x ‖
ఇంకేల నా యేసయ్యా‖ కళ్లుండి ‖
Verse
నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు
నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు‖ 2x ‖
నీవే నా గమ్యమని
నీలోనే నడిచెదను‖ 2x ‖
నాకేగా పరలోకము‖ కళ్లుండి ‖

Related Tags

PraiseWorshipSpiritual Life