Chorus
కలుగుఁగాక దేవా కలుగుఁగాక కలుగుఁగాక మా కిలలో నిప్పుడు
విలువ లేని దయ గల నీ దీవెన‖ కలుగు ‖
Verse
తనయుని కరుణయుఁ దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక
మాకుఁ కలుగు‖ కలుగు ‖
Verse
మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగఁ బెంపఁగ ఘన
సహాయము కలుగు‖ కలుగు ‖
Verse
ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగఁ బెంచిన ఘన సౌఖ్యంబు‖ కలుగు ‖