Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kalugunugaaka Dhaevuniki Mahima Kalugu

కలుగునుగాక దేవునికి మహిమ కలుగు

Kalugunugaaka Dhaevuniki Mahima Kalugu

Lyricist: Veerpula Moshe
Chorus
కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన
ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ‖ కలుగును ‖
Verse
ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల
పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము‖ కలుగును ‖
Verse
మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును
మదిఁ దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము‖ కలుగును ‖
Verse
ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక
పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లఁగ‖ కలుగును ‖
Verse
లోకపాపములు మోయుచుఁ బోవు యేసు రక్షకా వాసిగ
జనకుని కుడివైపునఁ గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు‖ కలుగును ‖
Verse
పరిశుద్ధుఁడవు ప్రభుఁడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతోఁ
తండ్రి యైన దేవునియందుఁబరిపూర్ణ మహిమతోఁ బ్రబలుచున్నామవామేన్‖ కలుగును ‖

Related Tags

PraiseWorship