Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvari Giri Siluvalo

కలువరి గిరి సిలువలో

Kaluvari Giri Siluvalo

Verse
కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా‖ 2x ‖
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా‖ 2x ‖
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా‖ 2x కలువరి ‖
Verse
కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా‖ 2x ‖
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా‖ 2x ‖
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా –‖ 2x కలువరి ‖
Verse
జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా‖ 2x ‖
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా‖ 2x ‖
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా –‖ 2x కలువరి ‖

Related Tags

WorshipGood FridaySacrifice