Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvari Giri Siluvalo Palu Shramalu Pondina Daivama

కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా

Kaluvari Giri Siluvalo Palu Shramalu Pondina Daivama

Chorus
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా‖ 2x ‖
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా‖ 2x ‖
యేసు దేవ నీదు త్యాగం - వివరింప తరమా‖ 2x ‖
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
Verse
కరుణ లేని, కఠిన లోకం - కక్షతో సిలువేసిన‖ 2x ‖
కరుణ చిందు మోము పైన - గేలితో ఉమ్మేసిన‖ 2x ‖
ముల్లతోను, మకుటమల్లి - నీదు శిరమున నుంచిరా
నీదు శిరమున నుంచిరా
కలువరిగిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా
Verse
జాలి లేని పాప లోకం - కలువ లేదు చేసిన‖ 2x ‖
మరణ మందు సిలువలోన - రుదిరమేనిను ముంచిరా‖ 2x ‖
కలుష రహిత వ్యధను చెప్పి - అలసి సొలసి పోతివా
అలసి సొలసి పోతివా
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా‖ 2x ‖
విశ్వ మానవ శాంతి కోసం - ప్రాణ మిచ్చిన జీవమా‖ 2x ‖
యేసు దేవ నీదు త్యాగం వివరింప తరమా‖ 2x ‖
కలువరి గిరి సిలువలో - పలు శ్రమలు పొందిన దైవమా

Related Tags

Good FridaySacrificeJesus