Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvari Naadha Karunanu Choopi

కలువరి నాధా కరుణను చూపి

Kaluvari Naadha Karunanu Choopi

Lyricist: Pastor Hannah Vimal
Verse
కలువరి నాధా కరుణను చూపి
నాకై బలియైతివా యేసయ్య
కలుషము బాపా రుధిరము కార్చి
జీవమునిచ్చావు నా యేసయ్య
ఎలా తీర్చను నీ రుణం
ప్రతిక్షణం అంకితం
సొగసైనను సురూపమైనను
లేనివానిగా నిను హింసించిరా
మనుష్యుల వలన తృణీకరణతో
విసర్జింపబడితివా నా యేసయ్య
అయినా ప్రేమ ఒక మాటమాత్రమైన
తిరిగిచెప్పనీయలేదు నా కోసమే
నా దోషములు నా పాపములు
మేకులతో నిన్ను సిలువ వేసెనా
అన్యాయముగా తీర్పుతీర్చినను
తగ్గింపుతో నాకై బలియైతివా
అయినా ప్రేమ ఒక మాటమాత్రమైన
తిరిగిచెప్పనీయలేదు నా కోసమే

Related Tags

ThanksgivingSacrificeJesus