Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Kaluvari Siluva

కలువరి సిలువ

Kaluvari Siluva

Lyricist: K Ebinezer
Verse
కలువరి సిలువ సిలువలో విలువ
నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెదికెనుగా‖ 2x ‖
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా‖ 2x కలువరి ‖
Verse
కష్టాలలోన నష్టాలలోన
నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన
కన్నీరు తుడిచావయ్యా‖ 2x ‖
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ‖ 2x ‖
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన‖ కలువరి ‖
Verse
పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా‖ 2x ‖
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ‖ 2x ‖
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన‖ కలువరి ‖

Related Tags

PraiseWorshipCross