Verse
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను నీ కోసమే అది నా కోసమే‖ 2x ‖
Verse
వధ చేయబడు గొర్రెవలె బదులేమీ పలుకలేదు
దూషించు వారిని చూచి దీవించి క్షమియించె చూడు‖ 2x ‖
Verse
సాతాను మరణమున్ గెల్చి పాతాళ మందు గూల్చి
సజీవుడై లేచినాడు స్వర్గాన నిను చేర్చినాడు‖ 2x ‖