Verse
కలువరిలో విముక్తి - కలిగెనో ప్రియుండా
Verse
పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి
శాపంబు వహించి - శ్రమల సహించెను
Verse
పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి
ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార
Verse
ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార
ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిది జేరి
Verse
ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేత
తానే కడుగును - మన పాపము నంత
Verse
సర్వజనులకు - సువార్త నందించి
సరియైనట్టి దారి - జూపింతుము వేగ
Verse
ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి
పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము