Chorus
కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస‖ కల్వరి ‖
Verse
సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల
కిరీటంబదేమి తరచి చూడుమీ‖ కల్వరి ‖
Verse
పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు
గొట్టెద రేల కరుణాలవాల‖ కల్వరి ‖
Verse
కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో
చీల గుచ్చెద రేల‖ కల్వరి ‖
Verse
ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి
వేసెదరేల పాటించరేల‖ కల్వరి ‖
Verse
ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె
దేవ క్రూరునికైన‖ కల్వరి ‖
Verse
పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి
యింత ఉత్కట బాధ‖ కల్వరి ‖
Verse
స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి
యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ‖ కల్వరి ‖
Verse
పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు
దెల్పుము మానవాళికిన్‖ కల్వరి ‖
Verse
సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ
శక్తినీయుము సిలువ ధ్యానమున‖ కల్వరి ‖